Supreme Court on NEET | నీట్ రద్దు కుదరదు.. పిటిషనర్‌పై సుప్రీం ఆగ్రహం..
Supreme Court on NEET | ప్రస్తుత దశలో నీట్ యూజీ-2021ను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

Supreme Court on NEET | ఈ ఏడాది మళ్లీ నీట్-యూజీ 2021 పరీక్ష నిర్వహించాలని జాతీయ విద్యా సంస్థ (ఎన్టీఏ)ను ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టి పారేసింది. నీట్-యూజీ 2021 పరీక్షను రద్దు చేస్తే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ దెబ్బ తింటుందని జస్టిస్‌లు ఎల్ఎన్ రావు, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి ప్రతియేటా నీట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోమారు ఇటువంటి పిటిషన్ దాఖలు చేస్తే జరిమానా విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.
మాల్ ప్రాక్టీస్.. పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణలు
ఎంబీబీఎస్ విద్యాభ్యాసం చేయాలని భావిస్తున్న విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లో ఈ ఏడాది నీట్ యూజీ 2021లో అవకతవకలు జరిగాయని, పేపర్‌లీకేజ్ అయ్యిందని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్న కోచింగ్ సెంటర్ల తీరుపై సీబీఐ కేసు దర్యాప్తు చేస్తున్నదని గుర్తు చేశారు. నీట్ ఫలితాలను వెల్లడించకుండా స్టే విధించాలని కూడా పిటిషనర్లు అభ్యర్థించారు.
ఐదు కేసులకే నీట్ రద్దు చేయాలా..
కేవలం ఐదు కేసుల కారణంగా దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులు రాసిన పరీక్షను రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. అలా పరీక్ష రద్దు చేయడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటువంటి పిటిషన్లు దాఖలు చేసినందుకు పిటిషనర్లపై తొలుత రూ.5 లక్షల జరిమానా విధిస్తామని ప్రతిపాదించింది. తర్వాత ఇప్పటికైతే హెచ్చరికలతో వదిలేస్తున్నామని, మరోసారి ఇటువంటి పిటిషన్లు దాఖలు చేస్తే మాత్రం జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- NEET 2021
- Supremecourt
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

