Naxal commander: లక్ష రివార్డు ఉన్న నక్సల్ కమాండర్ అరెస్టు
Naxal commander: నక్సల్ కమాండర్ సోది దివాను అరెస్టు చేశారు. సుక్మా ఆపరేషన్‌లో అతను చిక్కాడు. అతని తలపై లక్ష రివార్డు ఉంది. సంయుక్త దళాల ఆపరేషన్‌లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
సుక్మా: తలపై లక్ష రివార్డు ఉన్న ఓ నక్సల్ కమాండర్(Naxal Commander)ను చత్తీస్‌ఘడ్‌లో భద్రతా దళాలు అరెస్టు చేశాయి. సుక్మా జిల్లాలో ఆ అరెస్టు జరిగింది. అతని వద్ద నుంచి టిఫిన్ బాంబు, నాలుగు డిటోనేటర్లు, నాలుగు జెలటిన్ రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్ఘడ్ పోలీసులు, కోబ్రా, సీఆర్పీఎప్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అరెస్టు చేసిన నక్సలైట్‌ను సోది దివా అలియాస్ సునిల్గా గుర్తించారు. సుర్పన్గుడ ఆర్పీసీ ప్రాంతంలో ప్లాటూన్ కమాండర్‌గా దివా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అనేక నేరాల్లో ఆ నక్సలైట్ పాత్ర ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఐఈడీ పేలుళ్లు, మర్డర్లు, భద్రతా దళాలపై దాడులు, ఎన్కౌంటర్లు, సర్పంచుల హత్య లాంటి కేసుల్లో అతనున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

