బాంబే హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన మంత్రి మాలిక్.. ఎందుకంటే?

ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, బాంబే హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడే కుటుంబంపై విమర్శలు చేయబోమన్న హామీని ఉల్లంఘించినందుకు హైకోర్టుకు శుక్రవారం బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు నాలుగు పేజీల అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. ఇంటర్వ్యూలలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు కోర్టుకు గతంలో తాను ఇచ్చిన హామీ కిందకు రావని భావించానని అందులో పేర్కొన్నారు. ‘నవంబర్ 25, 29 నాటి ఉత్తర్వులలో నమోదు చేసినట్లుగా కోర్టుకు ఇచ్చిన నా హామీని ఉల్లంఘించినందుకు నేను ఈ గౌరవనీయమైన కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను’ అని నవాబ్ మాలిక్ తన అఫిడవిట్లో తెలిపారు.
ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే, ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి నవాబ్ మాలిక్ చేసిన విమర్శలను వ్యతిరేకిస్తూ సమీర్ తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే ఆయనపై పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో వాంఖడే, ఆయన కుటుంబ సభ్యుల పరువునకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయబోనని నవంబర్ 25న, 29న కోర్టుకు హామీ ఇచ్చారు.
అయితే, సమీర్ వాంఖడే కుటుంబంపై మంత్రి మాలిక్ మళ్లీ విమర్శలు చేశారు. దీంతో ఇచ్చిన హామీని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఆయనపై ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టకూడదు అని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం నోటీసు జారీ చేసింది. దీనికి స్పందించిన మంత్రి నవాబ్ మాలిక్ ఈ మేరకు కోర్టుకు క్షమాపణలను అఫిడవిట్ ద్వారా తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

