Rane Vs Udhav | ఉద్ధవ్ సర్కార్ హిందూ వ్యతిరేకి.. కేంద్రమంత్రి రాణె సంచలనం
Rane Vs Udhav | హిందువుల పండుగల సమయంలోనే మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధిస్తున్నదని కేంద్రమంత్రి నారాయణ్ రాణే ఆరోపణలు గుప్పించారు.

Rane Vs Udhav | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహా వికాస్ ఆఘాదీ సర్కార్ హిందు వ్యతిరేకి అని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె ఆరోపించారు. దేశమంతా కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్ని అల్లాడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ వచ్చే రెండు నెలల వరకు ఆంక్షలు విధించింది. శుక్రవారం గణేశ్ చతుర్థి సందర్భంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలపైనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
దీనిపై శుక్రవారం కేంద్రమంత్రి నారాయణ్ రాణే మండిపడ్డారు. కేవలం హిందువుల పండుగల సమయంలోనే మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధిస్తున్నదని ఆరోపణలు గుప్పించారు. ఇది తప్పని వ్యాఖ్యానించారు. హిందూత్వ గురించి మాట్లాడే శివసేన.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతోనే తన సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందన్నారు.
ఇటీవల తాను ఆ స్థానంలో ఉంటే, ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. దీనిపై కేసు నమోదు కావడం.. పోలీసులు అరెస్ట్ చేయడం.. అటుపై బెయిల్‌పై విడుదల కావడం ఒకదాని వెంట మరొక ఘటన చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి బీజేపీ, శివసేన మధ్య ఉప్పూనిప్పుగా ఉంటున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

