లక్నో: హిందూ వ్యక్తి బైక్‌పై ముస్లిం మహిళ ప్రయాణించింది. గమనించిన కొందరు ముస్లింలు ఒకచోట వారిద్దరిని అడ్డుకున్నారు. ఆ యువతి హిజాబ్‌ను బలవంతంగా తొలగించారు. (Woman stripped off hijab) ఆమె జుట్టుపట్టుకుని కొట్టారు. హిందూ వ్యక్తిపై కూడా దాడి చేశారు. ఆ మహిళ ఫిర్యాదుతో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. భవన్ ప్రాంతానికి చెందిన హిందూ యువకుడైన సచిన్, ఖలాపర్కు చెందిన 20 ఏళ్ల ముస్లిం యువతి ఫర్హీన్ ఒక ఫైనాన్స్ బ్యాంకులో పని చేస్తున్నారు. ఏప్రిల్ 12న రుణ వాయిదా వసూలు చేసి బైక్‌పై తిరిగి వెళ్తున్నారు.
కాగా, ఇరుకైన వీధిలో బైక్‌పై వెళ్తున్న వారిద్దరిని కొందరు ముస్లిం వ్యక్తులు అడ్డుకున్నారు. ఫర్హీన్ ధరించిన హిజాబ్‌ను బలవంతంగా తొలగించారు. హిందూ వ్యక్తితో కలిసి బైక్‌పై ప్రయాణించడంపై ఆమెను అసభ్యకరంగా తిట్టారు. జుట్టుపట్టుకుని చెంపపై కొట్టారు. సచిన్‌పై కూడా వారు దాడి చేశారు. వారిద్దరిని వేధించారు. దీనిని వీడియో రికార్డ్ చేశారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఫర్హీన్, సచిన్‌ను వారి బారి నుంచి కాపాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫర్హీన్ ఫిర్యాదుతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద నిందితులు కుంటుతూ నడిచిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వారు అలా నటించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
यूपी : मुजफ्फरनगर जिले में फाइनेंस बैंककर्मी सचिन अपनी मुस्लिम महिला सहकर्मी की बेटी के साथ किश्त लेने के लिए पहुंचा। एक जगह कुछ लोगों ने युवती का बुर्का उतरवाया और मारपीट की। 6 आरोपी सरताज, शादाब, उमर, अर्श, शोएब, शमी गिरफ्तार !! pic.twitter.com/Ck2B0jmHPw
— Sachin Gupta (@SachinGuptaUP) April 13, 2025
यूपी : मुजफ्फरनगर में मुस्लिम युवती का बुर्का उतरवाने वाले 6 मुस्लिम युवकों की ये Video पुलिस ने जारी की है, इसमें वो लंगड़ाते नजर आ रहे हैं।@AnujTyagi8171 https://t.co/X67G0NM9VB pic.twitter.com/NnnQrpaXMb
— Sachin Gupta (@SachinGuptaUP) April 13, 2025