మంగళూరులో టెన్షన్.. ముస్లిం యువకుడిపై దుండగుల దాడి
Mangalore | బీజేపీ యువమోర్చ నేత హత్యతో నివురుగప్పిన నిప్పులా ఉన్న కర్ణాటకలో మరో వివాదాస్పద ఘటన చేసుకున్నది. మంగళూరు శివార్లలో ఓ ముస్లిం యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి
బెంగళూరు: బీజేపీ యువమోర్చ నేత హత్యతో నివురుగప్పిన నిప్పులా ఉన్న కర్ణాటకలో మరో వివాదాస్పద ఘటన చేసుకున్నది. మంగళూరు శివార్లలో ఓ ముస్లిం యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో మంగళూరు, దాని సమీప ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో సూరత్కల్లో ముసుగులతో వచ్చిన నలుగురు వ్యక్తులు మహ్మద్ ఫాజిల్ అనే యువకుడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

దాడి నేపథ్యంలో సూరత్కల్, పనంబూరు, ముల్కీ, బాజ్పే ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నామని మంగళూరు పోలీస్ కమిషనర్ శశి కుమార్ చెప్పారు. ప్రజలు ఎవరూ గుమికూడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. శుక్రవారం కావడంతో ముస్లింపు వారివారి ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరు శాంతియుతంగా ఉండాలని, బాధితునికి వీలైనంత తొందరగా తగిన న్యాయం చేస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుంటామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

