బురఖా ధరించిన విద్యార్థినులు.. లోనికి రానివ్వని యూపీ కాలేజీ
జనవరి నుంచి కాలేజీలో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రొఫెసర్ ఏపీ సింగ్ తెలిపారు. డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన వారిని క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని చెప్పారు.
లక్నో: బురఖా ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ యువతులు నిరసనకు దిగారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. స్థానిక హిందూ కాలేజీలో చదువుతున్న ముస్లిం విద్యార్థినులు బుధవారం బురఖాలు ధరించి కాలేజీకి వచ్చారు. అయితే వారిని క్యాంపస్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్థినులు నిరసనకు దిగారు. కాలేజీ గేట్ వద్ద బలవంతంగా బురఖాలను తొలగించారని ఆరోపించారు.
కాగా, జనవరి నుంచి కాలేజీలో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రొఫెసర్ ఏపీ సింగ్ తెలిపారు. డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన వారిని క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కాలేజీ డ్రెస్ కోడ్‌లో బురఖాను కూడా చేర్చాలని సమాజ్‌వాదీ విద్యార్థి సంఘం (ఎస్సీఎస్) స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. తద్వారా బురఖా ధరించిన విద్యార్థినులను కూడా కాలేజీలోకి అనుమతించాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.
మరోవైపు డ్రెస్ కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం సమాజ్ వాదీ విద్యార్థి సంఘం (ఎస్సీఎస్), బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘానికి చెందిన స్టూడెంట్లు ఘర్షణకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ ఎమ్మెల్యే జమీర్ ఉల్లాఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బురఖాను వ్యతిరేకించే వారికి గుణపాఠం చెప్పాలి. బురఖాపై నిషేధం విధించిన వారిని నగ్నంగా ఊరేగించాలి’ అని అన్నారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంటున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

