Munna Helicaptor : హెలీకాప్టర్ తయారు చేశాడు.. రెక్క తగిలి చనిపోయాడు..
Munna Helicaptor : అతడో చిన్న మెకానిక్. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. నిత్యం కొత్తదనం కోసం పరితపించే ఇతగాడు.. హెలీకాప్టర్‌ను ఇంట్లోనే తయారుచేసే పనికి పూనుకున్నాడు. అంతా పూర్తయి పరీక్షిస్తుండగా...

యావత్మాల్ : అతడో చిన్న మెకానిక్. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. నిత్యం కొత్తదనం కోసం పరితపించే ఇతగాడు.. హెలీకాప్టర్‌ను ఇంట్లోనే తయారుచేసే పనికి పూనుకున్నాడు. అంతా పూర్తయి పరీక్షిస్తుండగా దురదృష్టం వెంటాడి.. అదే కాప్టర్ రెక్క తగిలి చనిపోయాడు. ఈ దురదృష్టకర సంఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ పట్టణంలో జరిగింది.
యావత్మాల్ పట్టణంలోని ఫులాస్వంజికి చెందిన 24 ఏండ్ల శేఖ్ ఇస్మాయిల్ అలియాస్ మున్నా 8 వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం కుటుంబపోషణ నిమిత్తం మెకానిక్ జీవితాన్ని ప్రారంభించాడు. ఒక గ్యారేజీలో వెల్డింగ్ పనులు చేసేవాడు. అయితే, ఏనాటికైనా సొంతంగా హెలీకాప్టర్ తయారు చేయాలన్నది ఇస్మాయిల్ కల. ప్రతి ఇంటిముందు కారుకు బదులుగా పార్కింగ్ చేసుకునేంతటి హెలీకాప్టర్ తీసుకురావాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం రెండేండ్ల పాటు కష్టపడి హెలీకాప్టర్ సిద్ధం చేశాడు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు దానిని ఎగిరేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. మున్నా హెలీకాప్టర్ ఎలా ఎగురుతుందో చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. అయితే, దురదృష్టవశాత్తు దాని రెక్క విరిగి మున్నా తలకు తగిలింది. తీవ్రంగా గాయపడిన మున్నా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
పైలట్ కావాలనుకునేవాడు..

గ్రామస్తుల ఎదుట చిన్న హెలీకాప్టర్‌ను ఎగురేయాలని ఎన్నో కలలు కని చివరకు కల నెరవేరకుండానే చనిపోవడం బాధాకరమని మున్నా కుటుంబీకులు విచారం వ్యక్తం చేశారు. పైలట్ కావాలని మున్నాకు కోరికగా ఉండేదని, అయితే డబ్బు లేకపోవడంతో కోరికను అణుచుకున్నాడని చెప్పారు. తనకు తానుగా ఫ్రిజ్‌లు, కూలర్లు, కప్‌బోర్డులు తయారుచేసుకునే నైపుణ్యం గలవాడని వారు తెలిపారు. ప్రస్తుతం సింగిల్ సీట్ హెలీకాప్టర్ తయారుచేసిన మున్నా.. రానున్న రోజుల్లో రూ.30 లక్షలకే అందరికీ అందుబాటులో ఉండేలా 6 సీట్ల హెలీకాప్టర్ తయారు చేయాలనే ఆశయంతో ఉన్నాడని వారు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
నష్టాల్లో నుంచి లాభాల్లోకి ఐఆర్సీటీసీ
మోదీకి చెక్ పెట్టేందుకు విపక్షాల సన్నాహాలు
గ్యాస్ సబ్సిడీ అందట్లేదా..? ఇలా ప్రయత్నించండి!
చైనా, పాక్ సరిహద్దుల్లో ‘డేగకన్ను’
మాజీ ఉపాధ్యక్షుడి కుమారుడు కిడ్నాప్
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
డయాబెటిస్‌ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

