Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
Bomb Threat Mail: ముంబై మేయర్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మేయర్ రీతూ తవాడేకు మెయిల్ ద్వారా లేఖ పంపారు. అమితాబ్ బచ్చన్ ఇళ్లు, దిల్జీత్ కన్సర్ట్లోనూ పేలుళ్లకు పాల్పడుతామని హెచ్చరించారు.
ముంబై: ముంబై మేయర్ ఆఫీస్‌కు బెదిరింపు మెయిల్(Bomb Threat Mail) వచ్చింది. దీంతో ఆ నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మెయిల్ ద్వారా బెదిరిస్తూ మేయర్ రీతూ తవాడేకు లేఖ పంపారు. మేయర్ ఆఫీసు వద్ద బాంబు బ్లాస్ట్ జరగనున్నట్లు హెచ్చరించారు. దీంతో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, గాయకుడు దిల్జీత్ దోసంజి కచేరిలను కూడా టార్గెట్ చేయనున్నట్లు తమ హెచ్చరికల్లో పేర్కొన్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉన్న మేయర్ ఆఫీసులో తీవ్రంగా గాలింపు చేపట్టారు. అయితే అనుమానిత వస్తువులను ఏదీ గుర్తించలేదు.
డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. అక్టోబర్ 31వ తేదీన స్కూల్‌పై గ్రేనేడ్ దాడి జరుగుతుందని హెచ్చరించారు. జూహూలో ఉన్న బచ్చన్‌కు చెందిన జల్సా ఇంటిపై అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య దాడి చేస్తామని బెదిరించారు. మహాలక్ష్మీ రేస్‌కోర్సు ఏరియాలో నవంబర్ 27వ తేదీన జరగనున్న దిల్జీత్ దోసాంజి కన్సర్ట్పై దాడి చేస్తామని ఓ సందేశంలో ఖలిస్తానీలు హెచ్చరించారు. బెదిరింపు మెసేజ్ నేపథ్యంలో భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. మెసేజ్‌లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు పంపారన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మేయర్ ఆఫీసు వద్ద సెక్యూర్టీ క్రమంగా పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

