Aurangzebs Tomb: ఔరంగజేబు సమాధికి రక్షణ కల్పించండి.. ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన మొఘల్ వారసుడు
Aurangzebs Tomb: ఔరంగజేబు సమాధికి రక్షణ కల్పించాలని కోరుతూ మొఘల్ వారసుడు ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. సమాధి వద్ద భద్రతను పెంచాలని కోరుతూ యాకూబ్ హబీబుద్దిన్ తన లేఖలో కోరారు. సమాధి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్: మహారాష్ట్రలోని శాంభాజీ నగర్ జిల్లాలో.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి(Aurangzebs Tomb) ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమాధిని తొలగించాలని ఇటీవల ఆ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. నాగపూర్‌లో భీకర స్థాయిలో విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దిన్.. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌కు లేఖ రాశారు. వక్ఫ్ ఆస్తులకు కేర్‌టేకర్‌గా ఉన్న ముతావలి ప్రిన్స్ యాకూబ్ తన లేఖలో .. ఔరంగబేబు సమాధికి రక్షణ కల్పించాలని కోరారు.
వాస్తవానికి ఆ సమాధిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించారని, ప్రస్తుతం పురావాస్తు శాఖ ఆధీనంలో ఆ సమాధి ఉన్నట్లు చెప్పారు. అయితే 1958 నాటి ప్రాచీన కట్టడాలు, ఆర్కియాలజీ సైట్ల పరిక్షణ చట్టం ప్రకారం ఔరంగజేబు సమాధి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని డిమాండ్ చేశారు. తొవ్వడం, కూల్చడం, మార్పులు కూడా చేయరాదు అన్నారు. సమాధి వద్ద భారీ స్థాయిలో సెక్యూర్టీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని యాకూబ్ తన లేఖలో డిమాండ్ చేశారు.
ఔరంగజేబు సమాధికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్కియాలజీ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన లేఖలో యూఎన్‌ను కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

