MUDA Scam | ఈడీ కీలక చర్యలు.. ముడా స్కామ్‌లో 300 కోట్ల ఆస్తుల అటాచ్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ కీలక ప్రకటన చేసింది.
- కేసులో నిందితుడిగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- 140 స్థిరాస్తులు అటాచ్
- స్కామ్‌లో సిద్ధరామయ్య భార్యకు అనుచిత లబ్ధి
- రూ.3.24 లక్షల భూమికి 56 కోట్ల పరిహారం
MUDA Scam | న్యూఢిల్లీ, జనవరి 17: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ కీలక ప్రకటన చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి చెందిన 140 స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం ప్రకటించింది. వీటి విలువ రూ.300 కోట్లు ఉంటుందని తెలిపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పని చేస్తున్న వారి పేర్లతో ఈ ఆస్తులు ఉన్నట్టు చెప్పింది.
ఈ కేసుకు సంబంధించి సోదాలు జరిపినప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలే కాకుండా ఇంకా భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించినట్టు ఈడీ తెలిపింది. తక్కువ విలువైన భూములకు పరిహారం రూపంలో అనేక ఖరీదైన స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ముడా అప్పగించిందని వెల్లడించింది. బినామీల పేర్లతో ఈ స్థలాలను పొందిన వ్యాపారులు వీటిని అమ్మేసి భారీగా అక్రమ నగదును పొందారని చెప్పింది. ఇందుకు బదులుగా అప్పటి ముడా చైర్మన్, కమిషనర్‌కు స్థిరాస్తులు, ముడా స్థలాలు, నగదు రూపంలో లంచాలు చెల్లించినట్టు ఆధారాలు లభించాయని తెలిపింది.
సిద్ధరామయ్య భార్యకు భారీగా లబ్ధి
ముడా భూకుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల భూమిని మొదట రూ.3,24,700కు సేకరించిందని తెలిపింది. ఆ తర్వాత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని, వీటి విలువ రూ.56 కోట్లు ఉంటుందని వెల్లడించింది. కాగా, సిద్ధరామయ్య తన పలుకుబడిని ఉపయోగించి ఇలా ఖరీదైన స్థలాలను పరిహారంగా దక్కేలా చేశారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిద్ధరామయ్యను కర్ణాటక లోకాయుక్త పోలీసులు సైతం విచారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

