Most Wanted Monkey | 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న.. ‘మోస్ట్ వాంటెడ్’ కోతి నిర్బంధం
Most Wanted Monkey | సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని (Most Wanted Monkey) ఎట్టకేలకు నిర్బంధించారు. డ్రోన్ సహాయంతో దానిని గుర్తించిన సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకుని బోనులో బంధించారు.
భోపాల్: సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని (Most Wanted Monkey) ఎట్టకేలకు నిర్బంధించారు. డ్రోన్ సహాయంతో దానిని గుర్తించిన సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకుని బోనులో బంధించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక కోతి మానవులకు హానికరంగా మారింది. ఇళ్లపై తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేశారు. అలాగే కోతులను పట్టుకునే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ కోతిని పట్టుకున్న వారికి రూ.21,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు.
కాగా, జిల్లా కలెక్టర్ చొరవతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్‌గఢ్‌కు బుధవారం చేరుకుంది. మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహాయంతో ఆ కోతిని పట్టుకునేందుకు నాలుగు గంటలు శ్రమించారు. డ్రోన్ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మగతలో ఉన్న ఆ కోతిని పట్టుకుని బోనులో బంధించారు. ఈ సందర్భంగా స్థానికులు జై శ్రీరామ్, జై భజరంగ్ దళ్ అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు మత్తు వీడిన తర్వాత బోనులో బంధించిన ఆ కోతి ఆగ్రహంతో రగిలిపోయింది. బోను నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నించింది. అయితే మనుషులకు ప్రమాదకరంగా మారిన ఆ కోతిని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖకు చెందిన రెస్క్యూ సిబ్బంది తెలిపారు. కాగా, ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని పట్టుకునేందుకు ప్రకటించిన రూ.21,000 రివార్డును ఆ టీమ్‌కు అందజేస్తామని రాజ్‌గఢ్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

