US Visa | నాలుగు వీసాల్లో ఒకటి భారత్‌కే.. ఉన్నత విద్యకోసం ఏటా పెరుగుతున్న అమెరికా వెళ్తున్నవారి సంఖ్య
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. అమెరికా రాయబార కార్యాలయం జారీచేసే ప్రతి నాలుగు వీసాల్లో ఒక వీసా మన దేశానిదే ఉంటున్నది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వీసాలను జారీచేసింది.
- 3 నెలల్లో 90వేలకుపైగా స్టూడెంట్ వీసాలు జారీ
- యూఎస్ ఎంబసీ వెల్లడి
US Visa | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. అమెరికా రాయబార కార్యాలయం జారీచేసే ప్రతి నాలుగు వీసాల్లో ఒక వీసా మన దేశానిదే ఉంటున్నది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వీసాలను జారీచేసింది. ఇదే విషయాన్ని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం (ఎంబసీ) సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అమెరికా చదువుల క్రేజ్ ఎంత మాత్రం తగ్గడం లేదు. కరోనా తర్వాత పరిస్థితుల తర్వాత మరింత పుంజుకుంది.
ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగినట్లుగా అమెరికా సైతం వీసాలను జారీచేస్తున్నది. గత ఏడాది మొత్తంగా 1.25 లక్షల విద్యార్థి వీసాలను అమెరికా జారీచేసింది. ఏడాది వేసవిలో 82 వేల విద్యార్థి వీసాలను అందజేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదని.. ఈ ఏడాది విద్యార్థి వీసాలను మరింత ఎక్కువగా జారీచేసే అవకాశాలున్నాయని ఇటీవలే ఎంబసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో మూడు మాసాల్లోనే 90 వేలకు పైగా వీసాలను జారీచేసింది. అమెరికాలో ఏటా రెండు సార్లు ప్రవేశాలు కల్పిస్తారు. ఆగస్టు -డిసెంబర్ సెమిస్టర్ సమయంలో మన విద్యార్థులు అమెరికా బాట పడుతుంటారు. మనవాళ్లు ఎంఎస్‌తో పాటు, బీఎస్ కోర్సుల్లోను చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

