బులంద్ షహర్ : ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో ఒక కోతి చేసిన పని చూసి జనం విస్తుపోయారు. ఓ న్యాయవాది సంచిని లాక్కొన్న ఓ కోతి చెట్టు పైకెక్కి రూ.2 లక్షల విలువైన రూ.500 నోట్లను జార విడచడంతో ఆశ్చర్యపోయారు. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుకు న్యాయవాది వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.
చెట్టు పైనుంచి కోతి నోట్లను జార విడుస్తుంటే వాటిని తీసుకోవడానికి జనం పరుగులు పెట్టారు. దీంతో బాధితుడు నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. కొద్ది సేపటికి ఓ వ్యక్తి చెట్టు పైకి ఎక్కి కోతిని బుజ్జగించడంతో అది సంచిని వదిలేసి పారిపోయింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికాైర్డెంది.