Monkeypox | మంకీపాక్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్..!
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు గురువారం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. మంకీపాక్స్ విషయంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని కోరారు. ఆరోగ్య అధికారులందరికీ క్రమం తప్పకుండా ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహించాలని సూచించారు.
ఇటీవల యూపీ నుంచి కేరళకు వచ్చిన కొందరిలో లక్షణాలు కనిపించాయి. అయితే, ఇప్పటి వరకు ఇంకా కేసులను ఇంకా అధికారికంగా ధ్రువీకరించకపోవడం ఊరట కలిగించే విషయం. విదేశాల నుంచి ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ గురువారం తెలిపారు. అలాగే సదరు వ్యక్తిని కేరళలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకితే మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలే బాధితుల్లోనూ కనిపిస్తున్నాయి. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య 77శాతం పెరిగినట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 6వేల మందికి మంకీపాక్స్ సోకింది. అదే సమయంలో ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కేసులు ఎక్కువగా ఐరోపా, ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి. మంకీపాక్స్ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. 80శాతానికిపైగా కేసులు యూరప్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

