iPhone : వృందావన్ గుడిలో ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. ఎప్పుడు తిరిగి ఇచ్చిందంటే.. వీడియో
iPhone : ఐఫోన్ ఎత్తుకెళ్లిన ఓ కోతి.. గుడి గోడ మీద కూర్చున్నది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. ఆ కోతి తన చేతుల్లో ఉన్న ఫోన్ వదల్లేదు. చివరకు గుడికి వచ్చిన భక్తులు ఫ్రూటీ ప్యాక్ విసరడంతో.. దాన్ని అందుకున్న ఆ కోతి తన చేతుల్లో ఉన్న ఐఫోన్‌ను కిందకు పడేసింది.
న్యూఢిల్లీ: కోతుల చేష్టలు అంతా ఇంతా కాదు. మనుషుల్ని సతాయించడంలో అవి నెంబర్ వన్. యూపీలోని వృందావన్ గుడిలో ఓ కోతి హంగామా చేసింది. ఓ వ్యక్తి చేతుల్లోంచి ఖరీదైన ఐఫోన్(iPhone) ఎత్తుకెళ్లింది. శ్రీ రంగనాథ్ జీ మందిర్ గోడపై కూర్చున్న ఆ కోతి తన చేతుల్లోని ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక ఆ కోతిని ఒప్పించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. గోడ వద్ద గుమ్మికూడిన జనం ఆ కోతి దిశగా ఫ్రూటీలు విసిరారు. చివరకు ఓ ఫ్రూటీ ప్యాక్ అందుకున్న ఆ కోతి.. ఆ సమయంలో తన చేతుల్లో ఉన్న ఫోన్‌ను వదిలేసింది. కింద ఉన్న వ్యక్తి కోతి వదిలిన ఐఫోన్‌ను చాకచక్యంగా అందుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

