Mumbai | సహజీవనం చేస్తున్న మహిళను ట్రీ కట్టర్‌తో ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడకబెట్టి..
వాళ్లిద్దరు మూడేండ్లుగా సహజీనం చేస్తున్నారు. ఇద్దరూ నడివయస్కులే. ఏమైందో ఏమో కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంకేముంది.. ఓ రోజు ఆమెను చంపేశాడు (Murder). ట్రీ కట్టర్‌తో (Tree cutter) ఆమె శరీరాన్ని ముక్కలుముక్కలుగా (Chopped) చేశాడు.
ముంబై: వాళ్లిద్దరు మూడేండ్లుగా సహజీనం (Live-In) చేస్తున్నారు. ఇద్దరూ నడివయస్కులే. ఏమైందో ఏమో కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంకేముంది.. ఓ రోజు ఆమెను చంపేశాడు (Murder). ట్రీ కట్టర్‌తో (Tree cutter) ఆమె శరీరాన్ని ముక్కలుముక్కలుగా (Chopped) చేశాడు. రోజూ వాటిని కుక్కర్లో (Cooker)ఉడకబెడుతున్నాడు. అయితే తప్పు ఎప్పటికీ దాగిఉండదుగా. ఆ ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసన అతడిని పోలీసులకు పట్టించింది.
56 ఏండ్ల మనోజ్ సహానీ (Manoj Sahani).. 36 ఏండ్ల సరస్వతి వైద్య (Saraswati Vaidya) అనే మహిళతో ముంబైలోని (Mumbai) గీతానగర్‌లో (Geeta Nagar) ఉన్న ఓ అపార్ట్మెంటులో మూడేండ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఇద్దరిమధ్య గత కొన్ని రోజులుగా ఏదో విషయమై గొడవలు జరుగుతున్నాయి. అవికాస్త పెద్దవవడంతో విసిగిపోయిన మనోజ్.. ఆమెను చంపేశాడు. చెట్లు కోసే మిషన్‌తో ఆమె దేహాన్ని ముక్కలుముక్కలుగా చేశాడు. వాటిని రోజూ కుక్కర్లో ఉడకబెడుతున్నాడు. అయితే ఓ రోజు వారి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లోపలికి వెళ్లి చూసి షాకయ్యారు.
నాలుగు రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకుగల కారణాలు తెలుసుకుంటున్నామని డీసీపీ జయంత్ బజ్బాలే (DCP Jayant Bajbale) చెప్పారు. మనోజ్‌తోపాటు మరో ఇద్దరు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

