MK Stalin : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి తమదే అధికారం అనుకున్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీకి చుక్కెదురైంది. ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారని ఊహించని సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin ) భావోద్వేగంతో ఓటమిపై స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని పేర్కొన్న డీఎంకే అధినేత.. టీవీకే పార్టీ పేరెత్తకుండానే విజేతలకు అభినందనలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పరాజయంతో కంగుతిన్న స్టాలిన్ ఎక్స్ పోస్ట్‌లో రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆయన తమ ఐదేళ్ల పాలనలో సాధించిన ఘనతలు వివరిస్తూనే.. ఇకపై ప్రతిపక్షంగా క్రియాశీలక పాత్ర పోషిస్తామని రాష్ట్ర ప్రజలకు వెల్లడించారు.
‘ప్రజల తీర్పును డీఎంకే గౌరవిస్తోంది. ఎన్నికల్లో విజేతలకు అభినందనలు. గత ఐదేళ్లలో తమిళనాడులో ఎన్నో ప్రాజెక్టులు చెపట్టాం. ప్రజలకు మంచి పాలన అందించాం. ప్రతి రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధిపథాన నడిపాం. మా పార్టీ సాధించిన విజయాలను చూసి ఓటెయ్యాలని ఎన్నికల ప్రచారంలో అభ్యర్థించాం. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు కొనసాగించాలనే ఉద్దేశంతోనే మేము డీఎంకేకు మరోమారు ఓటెయ్యాలని కోరాం.
மக்கள் தீர்ப்பைத் தலைவணங்கி ஏற்கிறோம். வெற்றி பெற்றவர்களுக்கு வாழ்த்துகள்!
கடந்த ஐந்தாண்டு காலத்தில் ஏராளமான திட்டங்களை உருவாக்கி, தமிழ்நாட்டு மக்களுக்கு நல்லாட்சியை வழங்கினோம். தமிழ்நாட்டை அனைத்து வகையிலும் உயர்த்தினோம். தேர்தல் களத்தில் எங்களது சாதனைகளைச் சொல்லியே வாக்குகளைக்… pic.twitter.com/CCsVdwJX0A
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 4, 2026
ద్రవిడ మున్నేట్ర కజగం సారథ్యంలోని లౌకిక, అభ్యుదయ కూటమికి ఓటేసిన తమిళ ప్రజలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. డీఎంకే పార్టీకి ఓటు వేసిన వారి కోసమే కాకుండా ఓటేయ్యని వారి కోసం కూడా మేము పనిచేశాం. రాష్ట్ర ప్రజానీకం పట్ల నేను నిజాయతీగా ఉన్నాను. నా ఆలోచనలకు తగ్గట్టుగా విధులు నిర్వర్తించాను. నా శక్తి కొద్దీ శ్రమించాను. నా ప్రియమైన కరుణానిధి కామ్రేడ్.. నా లెక్కనే ఆయన నిజాయతీగా సేవలందించారు. ఆయనను నా నుంచి వేరు చేయలేరు. ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
#WATCH | Tamil Nadu CM MK Stalin arrives at the DMK HQ Anna Arivalayam in Chennai after losing the Kolathur constituency seat to TVK leader VS Babu. pic.twitter.com/j28ErHhxiY
— ANI (@ANI) May 4, 2026
మాతో భుజం భుజం కలిపి పనిచేసిన నాయకులు, అధికారులు, శ్రామికులకు ధన్యవాదాలు. నా రాజకీయ జీవితంలో గొప్ప విజయాలు చూశా. అదే సమయంలో ఓటములను చవిచూశా. అందుకని.. నేను ఆదర్శాలు, విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తాను. అంతేతప్ప గెలుపు ఓటములను అనుసరించి కాదు. సో.. ద్రవిడ మున్నేట్ర కజగం రాజకీయ ప్రయాణం ఏమాత్రం చెక్కుచెదరకుండా కొనసాగుతుంది. ఆదర్శనీయమైన అధికార పార్టీగా పనిచేసిన డీఎంకే ఇకపై ఆదర్శ ప్రతిపక్ష పార్టీగా పనిచేయనుంది’ అని స్టాలిన్ తన పోస్ట్‌లో వెల్లడించారు. తనకు కంచుకోట అయిన కళాతుర్ నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోయారు. గతంలో డీఎంకేలో కీలక నేతగా ఉండి.. టీవీకే తరఫున పోటీచేసిన బీఎస్ బాబు(BS Babu) చేతిలో స్టాలిన్ ఊహించని పరాజయం చవిచూశారు.