Girl Gang Raped | కదులుతున్న కారులో.. నెలలుగా బాలికపై సామూహిక అత్యాచారం
Girl Gang Raped | కదులుతున్న కారులో ఒక బాలికపై కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కారుపై అనుమానించిన స్థానికులు దానిని అడ్డుకుని ఆ బాలికను రక్షించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
గువాహతి: కదులుతున్న కారులో ఒక బాలికపై కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కారుపై అనుమానించిన స్థానికులు దానిని అడ్డుకుని ఆ బాలికను రక్షించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు. (Girl Gang Raped) అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల బాలికకు ఆహారం ఆశ చూపి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను ఎక్కించుకున్నారు. కదులుతున్న ఆ వాహనంలో కొన్ని నెలలుగా ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బిశ్వనాథ్ చారియాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన స్థానికులు ఆ కారును అనుమానించి అడ్డుకున్నారు. బాలిక, కారులోని వ్యక్తులు అభ్యంతరకరమైన, అర్ధ నగ్న స్థితిలో కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ బాలికను రక్షించారు.
మరోవైపు కారులోని వ్యక్తులు కదులుతున్న ఆ వాహనం లోపల కొన్ని నెలలుగా తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ బాలిక ఆరోపించింది. దీంతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

