కాల్పులు జరిపింది పోలీసే.. మంత్రి పరిస్థితి మరింత విషమం.. మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌కు
Minister shot | ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి, అధికార బీజేడీ సీనియర్ నేత నవకిశోర్ దాస్‌పై కాల్పుల జరిపింది ఏఎస్సై గోపాల్ దాస్ అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముందుగా గుర్తు తెలియని దండగులు కాల్పులు జరిపినట్లుగా ప్రకటించిన పోలీసులు.. ఆ తర్వాత ఏఎస్సై గోపాల్‌దాసే నిందితుడిగా తేల్చారు.
భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి, అధికార బీజేడీ సీనియర్ నేత నవకిశోర్ దాస్‌పై కాల్పుల జరిపింది ఏఎస్సై గోపాల్ దాస్ అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముందుగా గుర్తు తెలియని దండగులు కాల్పులు జరిపినట్లుగా ప్రకటించిన పోలీసులు.. ఆ తర్వాత ఏఎస్సై గోపాల్‌దాసే నిందితుడిగా తేల్చారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని గాంధీచౌక్ దగ్గర ఓ ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఇవాళ ఉదయం అక్కడికి వచ్చారు.
మంత్రి కారు డోరు తీసుకుని దిగుతుండగానే ఏఎస్సై గోపాల్ దాస్ ఆయనపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంతో ఆయనను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించారు.
కాగా, మంత్రి కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్‌దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే, మంత్రిపై అతడు ఎందుకు కాల్పులు జరుపాల్సి వచ్చిందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీఐడీ విచారణకు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

