బీజేపీ ఎమ్మెల్యే దంపతుల ఖాతాలో ఉపాధి నిధులు
ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే దుర్గేశ్వర్ లాల్, ఆయన భార్య నిషా బ్యాంకు ఖాతాల్లోకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు జమయ్యాయి.
- ఉత్తరాఖండ్‌లో రాజకీయ దుమారం.. విచారణకు ఆదేశం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే దుర్గేశ్వర్ లాల్, ఆయన భార్య నిషా బ్యాంకు ఖాతాల్లోకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు జమయ్యాయి. ఈ విషయం రాజకీయ దుమారానికి దారి తీసింది. అయితే గతంలో ఎమ్మెల్యే దంపతులకు జాబ్ కార్డులు ఉండటం వల్లే ఆ నిధులు జమ అయ్యాయని బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు.
తనను అప్రతిష్ఠపాలు చేయడానికే ఈ కుట్ర జరిగిందని దుర్వేశ్వర్లాల్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బ్లాక్ డెవలప్మెంట్ అధికారి శశి భూషణ్ ఎమ్మెల్యే దంపతుల ఖాతాల్లో జమ అయిన ఉపాధి హామీ నిధులను రికవరీ చేస్తామని తెలిపారు. దుర్గేశ్లాల్ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఉపాధి హామీ పనుల ద్వారా రూ.5,214 పొందారు.
2021-25 మధ్య కాలంలో ఎమ్మెల్యే దంపతులిద్దరూ కలిసి ఈ పథకం ద్వారా రూ.22,962 వేతనంగా పొందినట్లు తేలింది. అయితే ఇందుకు సంబంధించిన మస్టర్ రోల్స్‌పై తాను సంతకాలు చేయలేదని సంబంధిత అసిస్టెంట్ ఉద్యోగి యశ్వంత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లు అందుబాటులో లేవన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

