న్యూఢిల్లీ: గాలి కాలుష్యాన్ని కొలిచే చౌకైన పరికరాన్ని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీన్ని ఫ్లాట్బర్న్ అని పిలుస్తున్నారు. 2017లోనే దీన్ని ఆవిష్కరించినా, ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
3డీ ప్రింటింగ్ ద్వారా లేదా చవకైన విడి భాగాలు ఆర్డర్ చేయడం ద్వారా ఈ పరికరం తయారు చేసుకోవచ్చు. ఈ పరికరం న్యూయార్క్, బోస్టన్లలో లభ్యమవుతున్నది. నైట్రోజన్ సహా వివిధ కాలుష్య కారకాలను ఈ పరికరం కచ్చితంగా కొలుస్తుంది.