Married Woman | తన ప్రేమకు అడ్డుచెప్పిందని.. వివాహితను కారులో ఉంచి చెరువులోకి తోసేశాడు
తన ప్రేమను నిరాకరించిందని వివాహితను దారుణంగా (Married Woman) హత్యచేసిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకున్నది. హసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32).. తన భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్నది.
బెంగళూరు: తన ప్రేమను నిరాకరించిందని వివాహితను దారుణంగా (Married Woman) హత్యచేసిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకున్నది. హసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32).. తన భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్నది. హసన్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే తన భార్యను విడిచిపెట్టి వస్తానని, తనను పెళ్లాడాలని గత కొంతకాలంగా ఆమెను సతాయిస్తున్నాడు. దానికి నిరాకరించడంతో రవి ఆమెపై కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో శ్వేతను హతమార్చాలని నిర్ణయించుకున్న అతడు.. పక్కా పథకం ప్రకారం.. బయటకు వెళ్దామని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును ఆపి.. ఆమెను అందులోనే ఉంచి చెరువులోకి తోసేశాడు. తర్వాత కారు అనుకోకుండా చెరువులో పడిందని, అందులో తన స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు కారును బయటకు తీశారు. రవిని తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో తానే ఆమెను చంపేశానని అసలు నిజం ఒప్పుకున్నాడు. శ్వేత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Hassan
- karnataka
- lake
- married woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

