తెలివిగా ఓటు వేయండి.. అసోం ప్రజలకు మన్మోహన్ సందేశం

న్యూఢిల్లీ: అసోంలో శనివారం తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తెలివితో ఓటు వేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. అసోం నుంచి 28 ఏండ్ల పాటు రాజ్యసభకు ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని శుక్రవారం విడుదల చేశారు. అభివృద్ధిని తెచ్చే ప్రభుత్వానికి ఓటు వేయాలని సూచించారు. ‘ఐదేండ్లు ఆర్థిక మంత్రిగా, పదేండ్లు ప్రధాన మంత్రిగా దేశానికి సేవ చేయడానికి అసోం ప్రజలు నాకు అవకాశమిచ్చారు. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే రోజు వచ్చింది. తెలివిగా ఓటు వేయమని అడుగుతున్నాను’ అని అన్నారు.
అసోంను తిరుగుబాటు నుండి బయటకు తీసుకువచ్చి అభివృద్ధి వైపు తీసుకువెళ్ళింది తరుణ్ గొగోయ్ అని మన్మోహన్ సింగ్ తెలిపారు. అయితే, ఇప్పుడు సమాజం మళ్లీ మత, సాంస్కృతిక, భాషాపరంగా విభజనకు గురవుతున్నదని, ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారంటూ బీజేపీపై మండిపట్టారు. దేశవ్యాప్తంగా భయం, ఆందోళకర వాతావరణం నెలకొన్నదని, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల పేదల జీవితాన్ని నరకప్రాయం చేశాయని, పేదలు మరింతగా పేదలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో అసోం తిరిగి శాంతి, అభివృద్ధి బాటలోకి రావాలని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో వివక్ష లేకుండా ప్రజల కోసం పని చేసే, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వం కోసం ప్రజలు ఓటు వేయాలని కోరారు. అసోం ప్రజలను కాపాడటానికి, అన్ని వర్గాల శ్రేయస్సు కోసం అసోం కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో నిజమైన వాగ్దానాలు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ ఇచ్చిన ఐదు వాగ్దానాలు అసోం అభివృద్ధికి దోహదపడతాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
Under the leadership of late Shri Tarun Gogoi, Assam made a new beginning towards peace & development. However it is now facing a serious set-back, society is being divided on the basis of religion, culture & language, rights of people being denied.: Former PM, Dr. Manmohan Singh pic.twitter.com/fTAJCQazqD
— Congress (@INCIndia) March 26, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

