అది నిరక్షరాస్యుల పార్టీ : కాషాయ పార్టీపై మనీష్ సిసోడియా ఫైర్
కాషాయ పార్టీ లక్ష్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ నిరక్షరాస్యలు పార్టీ అని దేశాన్ని విద్యకు దూరం చేయాలనేది కమలనాధుల ఆలోచన అని మండిపడ్డారు.
న్యూఢిల్లీ : కాషాయ పార్టీ లక్ష్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ నిరక్షరాస్యలు పార్టీ అని దేశాన్ని విద్యకు దూరం చేయాలనేది కమలనాధుల ఆలోచన అని మండిపడ్డారు. వారు ఇతర రాష్ట్రాల్లో చేసిన తరహాలో ఢిల్లీలోనూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సర్కారీ బడులు ఎందుకు మూతపడ్డాయో వారు విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిసోడియా శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో ఆప్ సర్కార్‌ను కూలదోల్చేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని, తన నివాసంలో సీబీఐ దాడుల్లో ఏమీ తేల్చలేకపోయారని అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో లోటుపాట్లు వెదికేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఎలాంటి అక్రమాలు బయటకు రాకపోతే స్కూళ్ల నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని కాషాయ పార్టీ చెబుతున్నదని అన్నారు.
బీజేపీ నేతలు చెప్పేవన్నీ అసత్యాలేనని సిసోడియా మండిపడ్డారు. ఢిల్లీలో సర్కారీ బడులు మెరుగ్గా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. నిరక్షరాస్యుల పార్టీ అయిన బీజేపీ దేశమంతటినీ విద్యకు దూరం చేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 2015 నుంచి 700 నూతన స్కూల్ భవనాలను నిర్మించిందని చెప్పుకొచ్చారు. ఈ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- BJP
- illiterates
- MANISH SISODIA
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

