నీట్ కేసులో ఇద్దరు అరెస్ట్
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసులో మనీష్ కుమార్, అశుతోష్ కుమార్ అనే వ్యక్తులను పట్నాలో సీబీఐ అరెస్టు చేసింది.
- పట్నాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ
- ఎన్టీఏ ఆఫీసు వద్ద నిరసనలు
- ప్రధాన ద్వారానికి తాళం
న్యూఢిల్లీ: నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసులో మనీష్ కుమార్, అశుతోష్ కుమార్ అనే వ్యక్తులను పట్నాలో సీబీఐ అరెస్టు చేసింది. పరీక్షకు ముందు కొంతమంది అభ్యర్థులకు వీరు పట్నాలోని లెర్న్ బాయ్స్ హాస్టల్లో వసతి కల్పించారని, అక్కడ వారికి లీక్ చేసిన పరీక్ష పత్రాల్ని, వాటి జవాబులను అందజేశారని సీబీఐ తెలిపింది.
ఎన్టీఏ కార్యాలయానికి తాళం
నీట్లో అక్రమాలకు నిరసనగా ఢిల్లీలోని జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) వద్ద గురువారం ఎన్ఎస్యూఐ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్టీఏ కార్యాలయ ప్రధాన ద్వారానికి తాళం వేశారు.
ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు
నీట్ అభ్యర్థులకు అందించిన ఓఎంఆర్ షీట్లకు సంబంధించి ఫిర్యాదులను లేవనెత్తడానికి ఏదైనా కాలపరిమితి ఉందా? అన్నది తెలియజేయాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్టీఏను ఆదేశించింది. ఈమేరకు నోటీసులు జారీచేసింది. అభ్యర్థులకు ఓఎంఆర్ షీట్లు రాలేదని పిటిషన్దారులు పేర్కొన్నారు. మరోవైపు, సిలబస్లో లేని పాఠ్యాంశాల నుంచి నీట్లో ప్రశ్నలు ఇచ్చారన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై రెండు వారాల్లోగా స్పందించాల్సిందిగా ఎన్టీఏ, జాతీయ మెడికల్ కమిషన్ను కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

