కరోనా ఎఫెక్ట్ : మణిపూర్లో పదిరోజులు పూర్తిస్థాయి లాక్డౌన్
మణిపూర్లో లాక్డౌన్ | మణిపూర్ రాష్ట్రంలో కరోనా (డెల్టా వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదిరోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇంఫాల్ : మణిపూర్ రాష్ట్రంలో కరోనా (డెల్టా వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదిరోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు, మందులు, కొవిడ్ వ్యాక్సినేషన్కు అనుమతి ఇచ్చింది. వీటితోపాటు కరోనా పరీక్షలు, వైద్య సేవలు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్, ఇంటర్ నెట్ సేవలు, విమాన ప్రయాణాలు, వ్యవసాయ కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతించిన సేవల సిబ్బంది మినహా ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు లాక్డౌన్ పాటించి సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుంటే కొవిడ్ వైరస్ను కట్టడి చేయడం సులభతరం కాదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

