ఆటోలో పేలిన కుక్కర్ బాంబు.. ఐసిస్‌తో నిందితుడికి లింకు
Mangaluru Auto Blast : దక్షిణ కర్నాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో బ్లాస్ట్ కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కర్నాటక అదనపు డీజీపీ అలోక్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆటోరిక్షాలో వెళ్తున్న ఓ ప్రయాణికుడు కుక్కర్ బాంబును తీసుకువెళ్లాడని, అది పేలడం వల్ల ఆ ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలైనట్లు ఆయన తెలిపారు.
మంగుళూరు: దక్షిణ కర్నాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో బ్లాస్ట్ కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కర్నాటక అదనపు డీజీపీ అలోక్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆటోరిక్షాలో వెళ్తున్న ఓ ప్రయాణికుడు కుక్కర్ బాంబును తీసుకువెళ్లాడని, అది పేలడం వల్ల ఆ ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలైనట్లు ఆయన తెలిపారు.
ఆటో డ్రైవర్‌ను పురుషోత్తం పూజారిగా, ప్రయాణికుడిని షారిక్గా గుర్తించామన్నారు. నిందితుడు షారిక్పై మూడు కేసులు ఉన్నాయని, రెండు మంగుళూరు సిటీలో, ఒకటి శివమొగ్గలో నమోదు అయినట్లు తెలిపారు. యూఏపీఏ చట్టం కింద అతన్ని బుక్ చేశారు. నిందితుడికి చెందిన ప్రదేశాలను చెక్ చేశామని, అక్కడ నుంచి చాలా వరకు పేలుడు పదార్ధాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. కొన్నింటిని ఆన్లైన్లో, కొన్ని ఆఫ్‌లైన్‌లో కొన్నట్లు గుర్తించామన్నారు.
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థతో షారిక్ పనిచేశాడని, ఆ సంస్థకు చెందిన అల్ హింద్ అనే గ్రూపుతో షారిక్‌కు లింకులు ఉన్నట్లు తేల్చారు. అరాఫత్ అలీ అనే వ్యక్తితో షారిక్‌కు సంబంధాలు ఉన్నాయన్నారు. అల్ హింద్ మాడ్యూల్ కేసులో ఆ ఇద్దరూ నిందితులే. షారిక్‌తో లింకున్న వారిని గుర్తిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

