జైసల్మేర్: రాజస్థాన్లో ఓ యువతిని ఆమె ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడితోపాటు అతనికి సహకరించిన వారిలో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా వారి కోసం కూడా గాలింపు కొనసాగుతున్నదని, త్వరలోనే ఆ నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
ఈ నెల 1న రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలోని సంఖ్లా గ్రామంలో 15 నుంచి 20 మంది గుంపు ఓ యువతి ఇంట్లో చొరబడి ఆమెను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వారిలో ఓ యువకుడు ఆమె మెడలో తాళికట్టాడు. ఎండుపుల్లలకు నిప్పుపెట్టి, ఏడుస్తున్న యువతిని తన చేతులపై ఎత్తుకుని అగ్నిగుండం చుట్టూ తిరిగినట్టు ఆ మంటల చుట్టూ తిరిగాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత దారుణంగా ఓ ఆడపిల్లను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నా ప్రభుత్వం నిందితులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని ప్రతిపక్ష బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసులు ప్రధాన నిందితుడితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
मीडिया द्वारा ये वीडियो जैसलमेर का बताया जा रहा है। रिपोर्ट्स के अनुसार एक लड़की को सरेआम किडनैप करके एक बंजर वीराने में आग जलाकर उसके साथ ज़बरदस्ती शादी कर ली। ये बेहद चौंकाने वाली और डराने वाली घटना है। @AshokGehlot51 जी मामले की जाँच कर कार्यवाही करें। pic.twitter.com/mZee4oJgSy
— Swati Maliwal (@SwatiJaiHind) June 6, 2023