లక్నో: గౌను కొన్న ఒక వ్యక్తి సైజు చిన్నది కావడంతో మార్చుకునేందుకు క్లాత్ షాప్‌కు వెళ్లాడు. అయితే పెద్ద గౌను కోసం అదనంగా రూ.50 చెల్లించాలని బట్టల వ్యాపారి చెప్పాడు. దీనిపై గొడవ జరుగడంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి బట్టల వ్యాపారి వేలు కొరికి పారిపోయాడు. (Man Bites Of Shopkeeper’s Finger) ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శివ చంద్ర కర్వారియాకు చెందిన క్లాత్ షాప్‌కు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక ఫ్రాక్ కొని వెళ్లిపోయాడు. మరునాడు అతడు ఆ షాప్‌కు తిరిగి వచ్చాడు. ఫ్రాక్ చిన్నదిగా ఉందని పెద్ద సైజుది ఇవ్వాలని అడిగాడు. దీని కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని శివ చంద్ర చెప్పాడు.
కాగా, ఈ విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి, శివ వేలు కొరికాడు. ఆ షాపులోని దుస్తులను రోడ్డుపైకి విసిరేసి పారిపోయాడు. క్లాత్ షాప్ యజమాని శివ ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేలు కొరికి పారిపోయిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.