Flooded Bridge | వంతెన దాటుతూ.. వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వ్యక్తి.. VIDEO
Flooded Bridge | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొంగిపొర్లుతున్న వంతెనను (Flooded Bridge) దాటుతూ ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు (Man Swept away).
Flooded Bridge | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొంగిపొర్లుతున్న వంతెనను (Flooded Bridge) దాటుతూ ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు (Man Swept away). ఈ ఘటన సియోని (Seoni)లో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సోమవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షం పడింది. దీంతో పొనార్ ఖుర్ద్ – ధాపర గ్రామాల మధ్య కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు వంతెనపై నుంచి పారుతున్నాయి. అయితే, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వరద నీటిలోనే ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి బైక్పై వంతెన దాటుతుండగా.. వరద ప్రవాహానికి ఒక్కసారిగా కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే.. కిందపడిపోయి బైక్తో సహా గల్లంతయ్యాడు.
ఆలస్యంగా సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకొని గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. అయితే, అప్పటికే చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. తిరిగి మంగళవారం ఉదయం ఆ ప్రాంతంలో కొట్టుకుపోయిన యువకుడి కోసం గాలింపు ప్రారంభించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
मध्य प्रदेश के सिवनी में पानी में डूबे पुल से बहा बाइक सवार… पुल को पार करने की कोशिश कर रहा था युवक #Seoni #WeatherUpdate #Monsoon #Rains #WaterLogging pic.twitter.com/vDT12boUqi
— Chetan Seth – पत्रकार (@ChetanSethMP) July 23, 2024
Also Read..
Anjali Birla | ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె
9 Priorities Of Budget | తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన : నిర్మలా సీతారామన్
Union Budget 2025 | ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

