Chandipura Virus: చాందీపురా వైరస్ లాంటి లక్షణాలు సోకిన వ్యక్తి మృతి
Chandipura Virus: చాందీపురా వైరస్ లాంటి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స పొందుతూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మృతిచెందాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రిపోర్టు ప్రకారం 21 ఏళ్ల ఆ వ్యక్తికి చాందీపురా వైరస్ లాంటి లక్షణాలు ఉన్నట్లు తేలింది.
ఇండోర్: చాందీపురా వైరస్(Chandipura Virus) లాంటి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స పొందుతూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మృతిచెందాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రిపోర్టు ప్రకారం 21 ఏళ్ల ఆ వ్యక్తికి చాందీపురా వైరస్ లాంటి లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఆ వ్యక్తిని నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చిక్సిత అందించారని, ఆ వ్యక్తి మృతిచెందినట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బీఎస్ సత్య తెలిపారు. అతనిలో చాందీపురా వైరస్ సోకిన లక్షణాలు కనిపించినట్లు ఆయన వెల్లడించారు.
అతని శ్యాంపిల్‌ను ఆగస్టు 10వ తేదీన పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఖార్గోనే ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తికి ఇండోర్‌లో ఆగస్టు 6వ తేదీ నుంచి చికిత్స జరిగింది. ఇండోర్ జిల్లాలో చాందీపురా వైరస్ కేసులు కన్ఫర్మ్ కాలేదని అధికారి తెలిపారు. చాందీపురా వైరస్‌తో జ్వరం, ఇన్సెఫలైటిస్ వస్తుంది. ఫ్లూ తరహాలో ఈ వైరస్ వ్యాధి లక్షణాలు ఉంటాయి. దోమలు, కీటకాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

