Mistaken Identity | తప్పుగా గుర్తించిన వ్యక్తిని.. పది రోజులు జైల్లో ఉంచిన పోలీసులు
Mistaken Identity | ఒక కేసులో నేరస్తుడి కోసం వెతుకున్న పోలీసులు తప్పుగా మరో వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. (Mistaken Identity) పోలీసులు పేర్కొన్న వ్యక్తిని తాను కాదంటూ అతడు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో అతడు అకారణంగా పది రోజుల పాటు జైలులో ఉన్నాడు.
లక్నో: ఒక కేసులో నేరస్తుడి కోసం వెతుకున్న పోలీసులు తప్పుగా మరో వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. (Mistaken Identity) పోలీసులు పేర్కొన్న వ్యక్తిని తాను కాదంటూ అతడు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో అతడు అకారణంగా పది రోజుల పాటు జైలులో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2021లో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ప్రమోద్ శంఖావార్ అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు కేసు విచారణ కోసం కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్ట్ 24న కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కాగా, ఘటంపూర్ స్టేషన్ పోలీసులు ప్రమోద్ శంఖావార్‌కు బదులు వసంత్ విహార్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ సాహుకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతడి మొదటి పేరుతోపాటు తండ్రి పేరు ఒకటిగా ఉండటంతో కోర్టుకు హాజరుకాని నేరస్తుడు అతడేనని భావించారు. అయితే పోలీసులు చెబుతున్న వ్యక్తిని తాను కాదని, తన తండ్రి జీవించి ఉన్నారని, వారు చెబుతున్నట్లుగా తన భార్య పేరు ఉషా కాదని సాహూ మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో పది రోజులపాటు జైలులో ఉన్నాడు. చివరకు తన ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో సెప్టెంబర్ 22న బెయిల్‌పై విడుదలయ్యాడు.
మరోవైపు ఈ అంశం పబ్లిక్ టాక్‌గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రమోద్ సాహును అరెస్ట్ చేసి జైలులో ఉంచిన పోలీస్ సిబ్బందిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిని తప్పుగా గుర్తించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ) ఆనంద్ ప్రకాష్ తివారీ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

