love triangle | ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు.. ఘర్షణలో స్నేహితుడ్ని కాల్చి చంపిన వ్యక్తి
love triangle | ఒకే అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు ప్రేమించారు. ట్రైయాంగిల్ లవ్ (love triangle) నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి తన స్నేహితుడిపై తుపాకీతో కాల్పులు జరిపి చంపాడు.
లక్నో: ఒకే అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు ప్రేమించారు. ట్రైయాంగిల్ లవ్ (love triangle) నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి తన స్నేహితుడిపై తుపాకీతో కాల్పులు జరిపి చంపాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. బబ్లూ, అతడి స్నేహితుడైన ఆర్యన్ పండిట్ ఒకే మహిళను ప్రేమించారు. దీంతో ఈ విషయంపై వారి మధ్య తరచుగా గొడవ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఒక బుల్లెట్ బైక్ వద్ద ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు మరో బైక్‌పై ఆ ప్రాంతానికి వచ్చారు. బబ్లూ తొలుత ఆర్యన్ చెంపపై కొట్టాడు. అనంతరం గన్‌తో అతడిపై కాల్పులు జరిపి పారిపోయాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆర్యన్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో బబ్లూపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం వెతుకుతున్నారు. అలాగే కాల్పులు జరిగిన ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dead
- Friend
- love triangle
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

