అహ్మదాబాద్: ఒక వ్యక్తి తన టీనేజ్ కుమార్తెపై వరుసగా మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. చివరకు భార్యకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. (man rapes teen daughter) గుజరాత్లోని నవసారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన 14 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మే 9, 10, 11 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ బాలికకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని కుమార్తెను బెదిరించాడు.
కాగా, భయపడిన ఆ బాలిక తొలుత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చివరకు మే 30న తండ్రి చేసిన దారుణం గురించి తన తల్లికి ఆమె చెప్పింది. దీంతో ఆ వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తన భర్తకు ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేసింది.
మరోవైపు ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ నిమిత్తం అతడ్ని జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.