ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్యను చంపాడు
Insurance Amount | రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం కట్టుకున్న భార్యను చంపాడో ఘనుడు. జైపూర్కు చెందిన షాలూ, మహేశ్ చంద్ భార్యా భర్తలు.
జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం కట్టుకున్న భార్యను చంపాడో ఘనుడు. జైపూర్కు చెందిన షాలూ, మహేశ్ చంద్ భార్యా భర్తలు. వీరికి ఓ కూతురు కూడా ఉన్నది. దంపతుల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో షాలూ.. గత కొంతకాలంగా తన పుట్టింట్లో ఉంటున్నది. అయితే తాను ఓ జ్యోతిష్యుడిని కలిశానని, ఇద్దరం కలిసి జీవించాలంటే 11 వారాలపాటు తెల్లవారుజామున హనుమాన్ ఆలయానికి వెళ్లాలని తన భార్యను నమ్మించాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని చెప్పాడు. పూజలు పూర్తయిన తర్వాత తనతో ఇంటికి తీసుకెళ్తానన్నాడు. భర్త మాటలు నమ్మిన షాలూ.. తన సోదరుడితో కలిసి ఉదయం 4.30 సమయంలో ఆలయానికి వెళ్తున్నది. ఈ క్రమంలో ఒకరోజు షాలూ వెళ్తున్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె సోదరుడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో వారు చనిపోయారని అంతా నమ్మారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముందస్తు ప్లాన్ ప్రకారమే షాలూను.. మహేశ్ చంద్ హత్య చేయించాడని, ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఇదంతా చేశాడని తేలింది. కొన్ని రోజుల క్రితం మహేశ్ తన భార్య షాలూ పేరుపై ఇన్సూరెన్స్ చేశాడు. సాధారణ మరణమైతే రూ.కోటి, యాక్సిడెంట్లో చనిపోతే రూ.1.90 కోట్లకు 40 ఏండ్ల కాలానికి పాలసీ తీసుకున్నాడు. ఈనేపథ్యంలో రౌడీ షీటర్ ముఖేశ్ సింగ్తో కలిసి ఆమె హత్యకు ప్లాన్ చేశాడు. యాక్సిడెంట్లో ఆమె చనిపోతే పూర్తి మొత్తం వస్తుండటంతో.. ఆమెను తెల్లవారుజామున దేవాలయానికి వెళ్లాలని నమ్మించాడు. ముందస్తు ప్రణాళిక మేరకు ఆమె ఆలయానికి వెళ్తుండగా కారుతో గుద్ది చంపేశారని డీసీపీ వందితా రాణా తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

