Man moves with wife’s severed head | భార్యను నరికి చంపి.. తెగిన తలతో తిరిగిన వ్యక్తి
Man moves with wife’s severed head | ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. తెగిన తలతో రోడ్డుపై తిరిగాడు. (Man moves with wife’s severed head) బస్టాప్ వద్ద ఉన్న అతడ్ని చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కోల్‌కతా: ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. తెగిన తలతో రోడ్డుపై తిరిగాడు. (Man moves with wife’s severed head) బస్టాప్ వద్ద ఉన్న అతడ్ని చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల గౌతమ్ గుచ్చైత్ తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో పదునైన ఆయధంతో ఆమె తల నరికి చంపాడు. తెగిన తలను చేతిలో పట్టుకుని చిస్తీపూర్ బస్టాప్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక చోట ఉన్న బల్లపై తెగిన భార్య తల ఉంచి కూర్చొన్నాడు.
కాగా, రక్తంతో తడిసి, తెగిన తలతో ఉన్న ఆ వ్యక్తిని చూసి స్థానికులు భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గౌతమ్‌ను అరెస్ట్ చేశారు. అతడి ఇంటికి వెళ్లి చూడగా తల లేని భార్య మృతదేహం కనిపించింది. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేన్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

