Man Killed For Bringing Chicken | ఇంటికి చికెన్ తెచ్చిన తమ్ముడు.. ఆగ్రహించి చంపిన అన్నలు
Man Killed For Bringing Chicken | కార్తీక మాసం నేపథ్యంలో ఇంటికి చికెన్ తెచ్చిన తమ్ముడిపై అన్నలు ఆగ్రహించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తాడుతో గొంతునొక్కి అతడ్ని హత్య చేశారు.
భోపాల్: కార్తీక మాసం నేపథ్యంలో ఇంటికి చికెన్ తెచ్చిన తమ్ముడిపై అన్నలు ఆగ్రహించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తాడుతో గొంతునొక్కి అతడ్ని హత్య చేశారు. (Man Killed For Bringing Chicken) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 9న బైరాగఢ్ ప్రాంతంలోని ఇందిరా నగర్లో నివసించే ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ములు మద్యం సేవించారు. మందు పార్టీలో చికెన్ కావాలని తమ్ముడైన 22 ఏళ్ల అన్షుల్ యాదవ్ పట్టుబట్టాడు. అయితే కార్తీక మాసం కావడంతో అన్నలు కుల్దీప్, అమన్ వద్దని చెప్పారు.
కాగా, బయటకు వెళ్లిన అన్షుల్ కోడి మాంసం కొని ఇంటికి తీసుకువచ్చాడు. ఇది చూసి అన్నలైన కుల్దీప్, అమన్ ఆగ్రహం చెందారు. ఈ అంశంపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా తాడుతో గొంతు నొక్కి తమ్మడు అన్షుల్‌ను హత్య చేశారు. ఆ తర్వాత తల్లితో కలిసి అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తిరిగి రాగానే స్పృహతప్పి పడిపోయాడని చెప్పారు. అయితే అన్షుల్ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అన్షుల్ మృతదేహాన్ని పరిశీలించారు. తాడుతో అతడి గొంతు నొక్కినట్లు ఉన్న ఆనవాళ్లపై తల్లి అనితను ప్రశ్నించారు. అయితే చిన్న కుమారుడ్ని పెద్ద కుమారులు హత్య చేయడాన్ని కప్పిపుచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. హత్య చేసిన రోప్‌ను దాచింది.
కాగా, తాడుతో అన్షుల్ గొంతు నొక్కి చంపినట్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తేలింది. దర్యాప్తు చేసిన పోలీసులు అతడి అన్నలను అరెస్ట్ చేశారు. హత్య ఆధారాన్ని దాచిన తల్లిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

