Man Kidnapped Nephew | డబ్బు కోసం మేనల్లుడ్ని కిడ్నాప్ చేయించిన వ్యక్తి.. పోలీసులకు ఎలా దొరికాడంటే?
Man Kidnapped Nephew | డబ్బులు డిమాండ్ చేసేందుకు మేనల్లుడైన బాలుడ్ని మేనమామ కిడ్నాప్ చేయించాడు. (Man Kidnapped Nephew) పోలీసులతో కలిసి వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు కిడ్నాపర్లు దొరికిపోవడంతో ఆ కిడ్నాప్ వ్యవహారం బెడిసికొట్టింది.
న్యూఢిల్లీ: డబ్బులు డిమాండ్ చేసేందుకు మేనల్లుడైన బాలుడ్ని మేనమామ కిడ్నాప్ చేయించాడు. (Man Kidnapped Nephew) పోలీసులతో కలిసి వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు కిడ్నాపర్లు దొరికిపోవడంతో ఆ కిడ్నాప్ వ్యవహారం బెడిసికొట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శాస్త్రి నగర్లో నివాసం ఉంటున్న సునీల్ కుమార్ కుమారుడైన ఏడేళ్ల బాలుడ్ని బుధవారం కిడ్నాప్ చేసినట్లు ఫోన్ కాల్ వచ్చింది. 30 నిమిషాల్లో మూడు లక్షలతో గుడి వద్దకు రావాలని ఆయనకు చెప్పారు.
కాగా, కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాపర్లు, బాలుడ్ని గుర్తించేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, కిడ్నాపర్లు చేసిన మొబైల్ నంబర్ల ద్వారా సమీపంలోని ఒక హోటల్ వద్ద వారు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. వెంటనే అక్కడకు వెళ్లి టీ తాగుతున్న వారిని అరెస్ట్ చేసి బాలుడ్ని కాపాడారు.
మరోవైపు బాలుడి కిడ్నాప్‌కు మేనమామ వికాశ్ ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి సునీల్ ఆర్థికంగా ఎదుగుతుండటాన్ని ఓర్వలేక డబ్బులు డిమాండ్ చేసేందుకు కిడ్నాప్ వ్యవహారం నడిపాడని చెప్పారు. బాలుడి కోసం పోలీసులతో కలిసి వెతుకుతూ కిడ్నాపర్లను కాపాడేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. హోటల్ వద్ద ఉన్న నిందితులు 27 ఏళ్ల సునీల్ పాల్, 25 ఏళ్ల దీపక్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. చాకెట్లు ఇస్తామని ఆశపెట్టి కిడ్నాప్ చేసిన బాలుడ్ని కాపాడినట్లు చెప్పారు. నిందితుల మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నామని, దీంతో మేనమామ వికాశ్ ప్లాన్ బయటపడిందని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- caught
- dramatically
- kidnapped
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

