Watch | హెల్మెట్ ధరించిన వ్యక్తి.. బ్యాంకు క్యాషియర్‌ను కొడవలితో బెదిరించి డబ్బుతో పరార్
Man In Helmet Robs UP Bank With Sickle | హెల్మెట్ ధరించిన వ్యక్తి బ్యాంకులోకి వచ్చాడు. క్యాషియర్‌ను కొడవలితో బెదిరించాడు. డబ్బుతో అక్కడి నుంచి పారిపోయాడు. బ్యాంకులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: హెల్మెట్ ధరించిన వ్యక్తి బ్యాంకులోకి వచ్చాడు. క్యాషియర్‌ను కొడవలితో బెదిరించాడు. డబ్బుతో అక్కడి నుంచి పారిపోయాడు. (Man In Helmet Robs UP Bank With Sickle) బ్యాంకులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తలకు హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి వీఐపీ ప్రాంతంలోని ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంకు సివిల్‌లైన్ బ్రాంచ్‌లోకి ప్రవేశించాడు. బ్యాంకులో ఉన్న కస్టమర్లు వెళ్లేంత వరకు అక్కడ వేచి ఉన్నాడు. ఆ తర్వాత క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. ఆ చాంబర్ డోర్ తోసి అందులోకి ప్రవేశించాడు. వెంట తెచ్చిన కొడవలిని మహిళా క్యాషియర్ మెడ వద్ద ఉంచి బెదిరించాడు. తన బ్యాగులో డబ్బులు కట్టలు వేయాలని ఆమెకు చెప్పాడు. ఆ మహిళా క్యాషియర్ అతడు చెప్పినట్లు చేసింది. దీంతో రూ.8.53 లక్షల నగదుతో అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఆ బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుతో పారిపోయిన నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP : जिला गोंडा में SP आवास से चंद कदम दूर एक बदमाश हंसिया (फसल काटने का उपकरण) लेकर बैंक में घुसा, कैशियर से 8.53 लाख रुपए लूटकर भागा। pic.twitter.com/nKaIjVZbN3
— Sachin Gupta (@SachinGuptaUP) February 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

