Man flees with Bike | టెస్ట్ రైడ్ కోసం బైక్ నడిపిన వ్యక్తి.. తర్వాత ఏం చేశాడంటే?
Man flees with Bike | రేసింగ్ బైక్ కొనేందుకు ఒక వ్యక్తి షోరూమ్‌కు వెళ్లాడు. టీ అమ్మే వ్యక్తిని వెంట తీసుకెళ్లి తండ్రిగా పరిచయం చేశాడు. టెస్ట్ రైడ్ కోసమంటూ కీస్ తీసుకుని బైక్‌తో పారిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు షోరూమ్ యజమాని గ్రహించాడు.
లక్నో: రేసింగ్ బైక్ కొనేందుకు ఒక వ్యక్తి షోరూమ్‌కు వెళ్లాడు. టీ అమ్మే వ్యక్తిని వెంట తీసుకెళ్లి తండ్రిగా పరిచయం చేశాడు. టెస్ట్ రైడ్ కోసమంటూ కీస్ తీసుకుని బైక్‌తో పారిపోయాడు. (Man flees with Bike) ఎంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు షోరూమ్ యజమాని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. సాహిల్‌కు రేసింగ్ బైక్ అంటే ఎంతో ఇష్టం. అయితే దానిని కొనే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఎలాగైనా ఆ బైక్ పొందాలని భావించాడు. నవంబర్ 3న ఒక షోరూమ్ వద్దకు వెళ్లాడు. సెకండ్ హ్యాండ్ రేసింగ్ బైక్‌ను లక్షకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నాడు. తండ్రితో కలిసి వచ్చి డబ్బులు ఇచ్చి బైక్ తీసుకుంటానని చెప్పాడు.
కాగా, కొంత సేపటి తర్వాత వృద్ధుడైన ఒక వ్యక్తితో కలిసి ఆ షోరూమ్‌కు సాహిల్ వెళ్లాడు. ఆ వ్యక్తిని తన తండ్రిగా పరిచయం చేశాడు. టెస్ట్ రైడ్ పేరుతో బైక్ కీ తీసుకున్నాడు. దానిని నడుపుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు సాహిల్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో షోరూమ్ యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ వృద్ధుడ్ని ఆరా తీయగా సాహిల్ గురించి తనకు తెలియదని చెప్పాడు. టీ తాగేందుకు రోజూ తన టీస్టాల్కు వస్తాడని అన్నాడు. ముఖ్యమైన పని ఉందంటూ తనను అక్కడకు తీసుకువచ్చాడని చెప్పాడు.
కాగా, ఇది విన్న షోరూమ్ ఓనర్ కంగుతిన్నాడు. బైక్‌తో పారిపోయిన సాహిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నవంబర్ 5న అతడ్ని అరెస్ట్ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే రేసింగ్ బైక్ అంటే తనకు ఇష్టమని, కొనే స్థోమత లేకపోవడంతో ఇలా ప్లాన్ చేసి చోరీ చేసినట్లు పోలీసులకు అతడు చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

