మహిళకు సీటు రిజర్వ్.. లేటు వయసులో అభ్యర్థి పెండ్లి

లక్నో: సర్పంచ్ కావాలని ఒక అభ్యర్థి ఆకాంక్షించగా ఆ సీటు మహిళకు రిజర్వ్ కావడం అతడ్ని నిరాశ పరిచింది. దీంతో తన మద్దతుదారుల సలహాతో లేటు వయసులో పెండ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యను ఎన్నికల బరిలోకి దించాడు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలోని కరణ్ చాప్రా గ్రామానికి చెందిన హతి సింగ్ 2015 సర్పంచ్ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచాడు. ఈసారి ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి గ్రామ అధిపతి కావాలనుకున్నాడు. అయితే ఆ స్థానం ఈసారి మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఏమి చేయాలో అతడికి పాలుపోలేదు.
కాగా, 45 ఏండ్ల హతి సింగ్ మద్దతుదారులు ఆయనకు సలహా ఇచ్చారు. పెండ్లి చేసుకుంటే భార్యను పంచాయతీ ఎన్నికల్లో నిలుపవచ్చని చెప్పారు. దీంతో హతి సింగ్ లేటు వయసులో ఈ నెల 26న ఒక మహిళను గ్రామంలోని ఆలయంలో పెండ్లి చేసుకున్నాడు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి సరైన ముహుర్తాలు లేకపోయినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. నామినేషన్ దాఖలుకు ఏప్రిల్ 13 చివరి రోజని, అందుకే ముందుగా పెండ్లి చేసుకున్నట్లు తెలిపాడు.
గ్రామం కోసం తాను గత ఐదేండ్లుగా చాలా కష్టపడ్డానని హతి సింగ్ చెప్పాడు. అయితే సర్పంచ్ సీటు మహిళకు రిజర్వ్ చేశారని, తన తల్లికి 80 ఏండ్లని, ఆమె పోటీ చేయలేరని తెలిపాడు. ఈ నేపథ్యంలో పెండ్లి చేసుకోకూడదనుకున్న తన నిర్ణయాన్ని మద్దతుదారుల సలహాతో మార్చుకున్నట్లు హరి సింగ్ చెప్పాడు. మరోవైపు డిగ్రీ చదువుతున్న వధువు, పెండ్లి అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

