man flees with police car | పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్ వాహనంతో పరార్
man flees with police car | పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనంతో పరార్ అయ్యాడు. (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం వెతికారు. చివరకు ఒక చోట పోలీస్ వాహనం కనిపించింది.
చండీగఢ్: పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనంతో పరార్ అయ్యాడు. (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం వెతికారు. చివరకు ఒక చోట పోలీస్ వాహనం కనిపించింది. అయితే లాక్ చేసి ఉండటంతో కీ కోసం ఆ ప్రాంతంలో వెతికారు. హర్యానాలోని యమునా నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖుర్ది గ్రామంలో ఒక కుటుంబ వివాదంపై పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ ( ఈఆర్వీ)లో పోలీసులు ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు ఘర్షణ పడటం చూశారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోకి ఎక్కించారు.
కాగా, పోలీసులు అనంతరం ఆ గ్రామానికి వెళ్లారు. ఫోన్ చేసిన ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా తీయడంలో బిజీ అయ్యారు. ఇంతలో పోలీస్ వాహనంలో ఉన్న వ్యక్తి దానిని డ్రైవ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఆ వెంటనే పోలీస్ బైక్‌ల ద్వారా మాయమైన పోలీస్ వాహనం కోసం వెతికారు. సుమారు పది కిలోమీటర్ల దూరంలో వదిలేసిన ఆ వాహనాన్ని గుర్తించారు.
మరోవైపు ఆ పోలీస్ వాహనం లాక్ చేసి ఉండటంతో ఆ వ్యక్తి కారు తాళం అక్కడ పడేసి ఉంటాడని పోలీసులు భావించారు. పోలీస్ వాహనం కీ కోసం ఆ పరిసర ప్రాంతాల్లో వెతికారు. పోలీస్ వాహనం చోరీ చేసి పోలీసులను ఇబ్బందులకు గురిచేసిన ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- detained
- flees
- haryana police
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

