లక్నో, ఆగస్టు 26: కొన్ని వార్తలు చదవగానే నవ్వుతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇదీ అలాంటి వార్తే. భార్యతో తరుచూ గొడవలు జరుగడం, ఆమె తరుచూ కొట్టడాన్ని తట్టుకోలేని ఓ భర్త 80 అడుగుల ఎత్తు ఉన్న ఓ పామ్ చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు. ఇలా ఓ గంట లేదా ఒకరోజు కాదు.
ఏకంగా నెల రోజులుగా అక్కడే నివసిస్తున్నాడు. ఈ విచిత్ర ఘటన యూపీలోని కోపగంజ్ అనే ప్రాంతంలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా రామ్ప్రవేశ్ చెట్టు దిగడం లేదని గ్రామపెద్దలు చెబుతున్నారు. తమ ఇండ్లల్లో ఏం జరుగుతుందో తొంగి చూడటానికే రామ్ప్రవేశ్ ఇలా చెట్టు ఎక్కినట్టు ఇరుగుపొరుగు మహిళలు ఆరోపిస్తున్నారు.