man attacks school girl with sword | స్కూల్ బాలికపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. పోలీస్ నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులు
man attacks school girl with sword | ఒక వ్యక్తి స్కూల్ బాలికపై కత్తిలో దాడి చేశాడు. (man attacks school girl with sword ) అతడ్ని అదుపులోకి తీసుకున్న కొందరు పోలీసులకు అప్పగించారు. అయితే ఒక పోలీస్ నుంచి పిస్టల్ లాక్కున్న అతడు కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి కాలుపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
లక్నో: ఒక వ్యక్తి స్కూల్ బాలికపై కత్తిలో దాడి చేశాడు. (man attacks school girl with sword ) అతడ్ని అదుపులోకి తీసుకున్న కొందరు పోలీసులకు అప్పగించారు. అయితే ఒక పోలీస్ నుంచి పిస్టల్ లాక్కున్న అతడు కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి కాలుపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం 9వ తరగతి చదువుతున్న బాలిక ట్యూషన్‌కు వెళ్తున్నది. మోదీనగర్ ప్రాంతంలోని జగత్‌పురి కాలనీలో 35 ఏళ్ల షౌకిన్ ఆమెను అడ్డుకున్నాడు. ఆ బాలికకు తెలిసిన వ్యక్తి అయిన అతడు ఆ స్కూల్‌కు వెళ్లవద్దంటూ కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది.
కాగా, స్థానికులు కొందరు షౌకిన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల కోసం అతడ్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ ఒక పోలీస్ నుంచి పిస్టల్ లాక్కున్నాడు. గాలిలోకి కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి కాలుపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయమైన అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ రెండు సంఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

