చెన్నై: గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఒక వ్యక్తి బురఖా ధరించి డ్యాన్స్ చేశాడు. (Man wearing burqa dances) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 21న గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా కొందరు యువకులు సందడి చేశారు. అందులోని ఒక వ్యక్తి బురఖా ధరించి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
కాగా, వైరల్ అయిన ఈ వీడియోపై ఫిర్యాదు అందడంతో పోలీసులు స్పందించారు. గణేష్ ఊరేగింపులో బురఖా ధరించి డ్యాన్స్ చేసిన వ్యక్తిని విరుతంపట్టుకు చెందిన అరుణ్ కుమార్‌గా గుర్తించారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
The man seen in a video wearing a burqa (Religious dress for females, mostly Muslims) and dancing during Ganesh Chathurthi celebrations in Tamil Nadu's Vellore district on September 21, has been identified as 'Arunkumar' and arrested for inciting religious sentiments.
India. pic.twitter.com/EJnjsOxCLG— Funny News Hub (@Funnynewshub) September 24, 2023