కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (మమతా వర్గం) అధినేత్రి మమతా బెనర్జీ సహనం కోల్పోయారు. ర్యాలీ అనంతరం తలెత్తిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Mamata Banerjee loses cool) బరుయిపూర్లో బాలికపై అత్యాచారం, హత్యకు నిరసనగా బుధవారం టీఎంసీ యువజన విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది. కలకత్తా హైకోర్టు అనుమతితో బల్లిగంజ్ ఫారీ నుంచి హజ్రా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అయితే బీజేపీ మద్దతుదారులు ర్యాలీలోకి చొరబడి అడ్డుకునేందుకు ప్రయత్నించారని టీఎంసీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తోపులాట, భౌతిక దాడులకు దారి తీసింది.
కాగా, ఈ ఘర్షణలో టీఎంసీ యువజన, విద్యార్థి విభాగాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు మమతా బెనర్జీ వాహనాలు ఏర్పాటు చేశారు. ఆ వాహనాలు వెళ్లేందుకు తన నివాసం వెలుపల మార్గాన్ని ఖాళీ చేయాలని పార్టీ కార్యకర్తలను ఆమె కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలపై ఆగ్రహంతో అరిచారు.
మరోవైపు ఈ గందరగోళం మధ్య మమతా బెనర్జీ తన సహనాన్ని కోల్పోయారు. తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన పార్టీ కార్యకర్త చెంపపై కొట్టారు. అలాగే మరికొందరిపైనా ఆమె చేయి చేసుకున్నారు. మీడియా కెమెరాల్లో రికార్డైన ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Former West Bengal CM Mamata Banerjee loses her cool, slaps her own party worker during #TMC protest in #Kolkata. #MamataBanerjee pic.twitter.com/uHCYIfHNlJ
— India Blooms (@indiablooms) July 8, 2026