మోదీ నాన్న కూడా వెళ్లాల్సిందే
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయి ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లోని పాట్నాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు చేస్తున్న క్రమంలో ‘మోదీ ఎక్కడికీ వెళ్లబోరు’ అంటూ సభికుల్లో ఒకరు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే సహనం కోల్పోయారు. ‘మోదీయే కాదు ఆయన బాబు (తండ్రి) కూడా వెళ్లాల్సిందే’ అంటూ ఆయన ప్రతిస్పందించిన తీరు ఇప్పుడు వివాదానికి దారితీసింది.
- కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. అమిత్ షా అభ్యంతరం
పాట్నా, అక్టోబర్ 25: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయి ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లోని పాట్నాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు చేస్తున్న క్రమంలో ‘మోదీ ఎక్కడికీ వెళ్లబోరు’ అంటూ సభికుల్లో ఒకరు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే సహనం కోల్పోయారు. ‘మోదీయే కాదు ఆయన బాబు (తండ్రి) కూడా వెళ్లాల్సిందే’ అంటూ ఆయన ప్రతిస్పందించిన తీరు ఇప్పుడు వివాదానికి దారితీసింది.
నల్లధనాన్ని వెనక్కి తెస్తానంటూ మోదీ చేసిన వాగ్దానంపై, ఆయన అనుసరిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలంపై తీవ్రంగా విమర్శలు చేసిన ఖర్గే.. మోదీ ప్రధానిగా కొనసాగినంత కాలం దేశంలో శాంతి ఉండదని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగానికి విరుద్ధ అభిప్రాయాలు కలిగి ఉన్నాయని విమర్శించారు. సోషలిస్ట్ సిద్ధాంతంతో ఏర్పడిన జనతా దళ్ (యునైటెడ్) పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చడం ద్వారా ఆ భావజాలానికి బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ నీళ్లు వదిలారని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలను హోం మంత్రి అమిత్ షా తప్పుబట్టారు. ప్రధాని దివంగత తండ్రి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖర్గే మర్యాద హద్దులన్నింటినీ దాటేశారని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

