ఇన్ని రోజులు రామ మందిరం.. ఇప్పుడు దావుద్ పేరుతో ఓట్ల వేట : ఉద్ధవ్ ఫైర్
బీజేపీపై అసెంబ్లీ వేదికగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసలు బీజేపీ జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీతో ఎందుకు పొత్తు పెట్టుకుందో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఒబామా లాడెన్ పేరు మీద ఎప్పుడైనా ఓట్లు అడిగారా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను చంపేయాలని, చంపేస్తారా? అని సీఎం ఉద్ధవ్ బీజేపీని ప్రశ్నించారు. నిజంగా మంత్రి నవాబ్ మాలిక్‌కు దావూద్‌తో సంబంధాలుంటే.. ఇన్ని సంవత్సరాలుగా కేంద్ర దర్యాప్తు బృందాలు ఏం చేశాయని సీఎం ఉద్ధవ్ సూటిగా నిలదీశారు. మంత్రి నవాబ్ మాలిక్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో వుందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్‌కు కూడా తెలుసని సీఎం ఉద్ధవ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- CM Uddhav
- Dawood
- nawab malik
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

