Maharastra: మోదీ మార్ఫింగ్ ఫోటో షేర్ చేసినందుకు.. కాంగ్రెస్ నేతకు పబ్లిక్‌గా చీర కట్టిన బీజేపీ వర్కర్లు.. వీడియో
Maharastra: మార్ఫింగ్ చేసిన ప్రధాని మోదీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాంగ్రెస్ నేతను పట్టుకుని బీజేపీ మద్దతుదారులు అతనికి చీర కట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
కళ్యాన్: పుణెలో బీజేపీ వర్కర్లు ఓ స్థానిక కాంగ్రెస్ నేతకు చీర కట్టించారు. ప్రధాని మోదీకి చెందిన మార్ఫింగ్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కాంగ్రెస్ నేత ప్రకాశ్ పగరేకు బీజేపీ మద్దతుదారులు బలవంతంగా చీర కట్టించారు. స్థానిక బీజేపీ ఆఫీస్ బేరర్ మరికొంత మందితో కలిసి కాంగ్రెస్ లీడర్‌ను అడ్డగించారు. ఆ తర్వాత చీర తీసి అతనికి కట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది.
బీజేపీ నేతలపై న్యాయపరమైన పోరాటం చేయనున్నట్లు కాంగ్రెస్ నేత పగరే తెలిపారు. కళ్యాణ్‌కు చెందిన బీజేపీ ప్రెసిడెంట్ నందు పరబ్తో పాటు కొంతమంది డోంబ్లీ ఏరియాలో కాంగ్రెస్ నేతను పట్టుకున్నారు. రోడ్డు మధ్యలోనే అతని చుట్టూ చీర చుట్టేశారు. ఈ చర్యను పరబ్ సమర్థించారు. ప్రధాని మోదీని కించపరిచినందుకు చీర కట్టినట్లు చెప్పారు.
అయితే బీజేపీ నేతలు తనను కులం పేరుతో దూషించి కొట్టినట్లు కాంగ్రెస్ నేత పేర్కొన్నాడు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు బుక్ చేయనున్నట్లు ప్రకాశ్ చెప్పాడు.
BJP workers force 73-year-old Congress leader to wear sari over social media post against PM Modi.
“Posting such a distasteful image of our Prime Minister is not only offensive but also unacceptable. If such attempts are made again to defame our leaders, the BJP will give an… pic.twitter.com/cA9SZu12y9
— The Tatva (@thetatvaindia) September 23, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

